![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 02:04 PM
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లను ఐపీఎస్ సజ్జనార్ వదిలిపెట్టేలా లేరు. సజ్జనార్ చొరవతో లోకల్ బాయ్ నాని అలాగే భయ్యా సన్నీయాదవ్‌పై ఇటీవల పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా హర్ష సాయికు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాలోవర్లను అడ్డం పెట్టుకొని ఇలాంటి వాళ్లు రూ.కోట్లు సంపాదిస్తున్నారని ఇలాంటి వారిని ఎవరూ ఫాలో కావొద్దని యువతకు సూచించారు.