|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 03:53 PM
మల్లారెడ్డి భూవివాదం మరోసారి తెరపైకి వచ్చింది. జీడిమెట్ల గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న సుచిత్ర జంక్షన్ సమీపంలోని మల్లారెడ్డి భూములపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
శనివారం సదరు భూమిని సర్వే చేయడానికి అధికార యంత్రాంగం అక్కడికి చేరుకుంది. దీంతో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా అక్కడికి చేరుకుని సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం లేకుండా ఎలా సర్వే చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ నెలకొంది.