|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 10:50 AM
రోడ్డు నిర్మాణానికి ఆటంకాలు తొలగించిన హైడ్రాకు మణికొండ వెంకటేశ్వర కాలనీ తో పాటు పరిసర కాలనీల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు మీదకు బుధవారం సాయంత్రం ర్యాలీ గా వచ్చి సెల్ ఫోన్ల టార్చ్ వేసి హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. చుట్టూ రహదారులున్నా వేంకటేశ్వర కాలిని నుంచి తారామతి బారాదరికి రహదారి లేకుండా పోయింది. మొత్తం 9 కిలోమీటర్ల దూరంలో 2 కిలోమీటర్ల మేర ఆటంకాలు ఏర్పడ్డాయి మధ్యలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి రోడ్డు వేయకుండా కొంతమంది అడ్డు పడ్డారు. హైడ్రా ప్రజావానికి ఫిర్యాదు అందడంతోనే రంగంలోకి దిగి విచారించి ఆక్రమణలను తొలగించింది. దీంతో GHMC రోడ్డు వేయడం మొదలు పెట్టింది. 60 గీతల రోడ్డు కు లైన్ క్లియర్ అవ్వడంతో స్థానికంగా వున్న నివాసితులు బుధవారం థాంక్స్ టు హైడ్రా అని నినదించారు.