|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 12:22 PM
మేడారం మహాజాతర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)కు రూ.20.24 కోట్ల ఆదాయం సమకూరింది. లక్షలాది మంది భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులను ఆర్టీసీ ఈడీ కేఆర్‌జడ్పీ సోలోమన్ అభినందించారు. వరంగల్ ఆర్ఎం దర్శనం విజయభాను మాట్లాడుతూ 1,711 బస్సులతో 25,027 ట్రిప్పులు నడిపించామని చెప్పారు. 28,06,155 కిలోమీటర్లు బస్సులు నడిపించడం ద్వారా రూ.20,24,28,124 ఆదాయం సమకూరిందని తెలిపారు. 12,33,585 మంది ప్రయాణించగా, 6,08,686 మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు మెమెంటోలు అందజేసి సత్కరించారు. డిప్యూటీ ఆర్ఎంలు కె. భాను కిరణ్, పి మహేశ్ పాల్గొన్నారు.