|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 12:45 PM
హైదరాబాద్ లో సంపన్నులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రైవేటు జెట్ లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఖరీదైన పెళ్లిళ్లు, పార్టీలు, సినీ కార్యక్రమాలకు వెళ్లడానికి వీటిని వాడుతున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఆరు ప్రైవేటు జెట్ లు సేవలు అందిస్తున్నాయి. గత రెండేళ్లలో వీటి వాడకం గణనీయంగా పెరిగింది. వ్యక్తిగత గోప్యత, సాధారణ విమాన ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందుల కారణంగా ప్రైవేట్ జెట్ లకు డిమాండ్ పెరుగుతోంది. 50 సీట్ల విమానం అద్దెకు రూ.60 లక్షలు, 100 సీట్ల విమానానికి రూ.90 లక్షలు, 200 సీట్ల విమానానికి రూ.1.25 కోట్లు వరకు ఖర్చవుతుంది.చెన్నై నుంచి మధురైకి వెళ్లాలంటే రెండు ప్రైవేటు విమానయాన సంస్థలు రూ.3వేల టిక్కెట్ ధరను.. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు రూ.17వేలు నిర్ణయిస్తున్నారు.టిక్కెట్ల ధరలను పోల్చుకుంటున్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ప్రైవేటు ఎయిర్ క్రాఫ్ట్‌లను ఎంచుకుంటున్నారు. సినిమా ప్రచారాలకు ఆయా చిత్రాల నిర్మాతలు బేగంపేట నుంచి ఎయిర్ క్రాఫ్ట్‌లతో వెళ్తున్నారు.