|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 01:49 PM
మున్సిపల్ ఎన్నికల వేళ పలు ప్రాంతాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధాన పార్టీల నేతలు ఘర్షణలకు దిగారు. ఇదిలా ఉండగా జగిత్యాలలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ రెబల్ అభ్యర్థి పులి శ్రీధర్ కంటతడి పెట్టుకోవడం చర్చనీయశం అవుతోంది. స్వతంత్ర అభ్యర్థి దొంగ ఓటర్లకు ఫోన్ చేసి పిలిపించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తనని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు ఓట్లు వేసేందుకు బారులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 52,17,413 మంది (పురుషులు – 25,49,750, మహిళలు – 26,67,025) ప్రజలు ఓటు వేయనున్నారు.