రాత్రిపూట పోస్టల్ సేవలు, రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు తపాలా శాఖ సర్వీసులు
Fri, Feb 20, 2026, 06:21 PM
|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 07:04 PM
TG: బీఆర్ఎస్ హయాంలో 'గృహలక్ష్మి' పథకం కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'గృహలక్ష్మి' కింద ఇళ్ల నిర్మాణం ప్రారంభించి బిల్లులు రాక పెద్ద సంఖ్యలో మధ్యలోనే నిలిచిపోయాయి. తాజాగా ఈ పెండింగ్ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాల ప్రకారం పునాది ప్రాంతం 400-600sq ft మధ్య ఉండాలి. బేస్‌మెంట్ పూర్తయితే ఆ దశ డబ్బులు చెల్లించరు. పై కప్పు లెవల్ వరకు రూ.లక్ష, స్లాబ్ పూర్తయితే రూ.2L, మొత్తం నిర్మాణం పూర్తయితే మరో రూ.లక్ష చెల్లించనుంది.