|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 09:06 PM
హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం ఈరోజు నిర్ణయించింది. మెట్రో రైలు స్వాధీనంపై ఇదివరకే ప్రభుత్వం ప్రకటన చేసింది. స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావులతో ఈ ఉపసంఘాన్ని నియమించింది. గత సంవత్సరం సూత్రప్రాయంగా జరిగిన ఒప్పందంలో ఎల్ అండ్ టీకి రూ.2 వేల కోట్ల ఈక్విటీని ఏకమొత్తంగా చెల్లించాలని, రూ.13 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకోవాలని అవగాహనకు వచ్చాయి. నాటి నుంచి స్వాధీన ప్రక్రియ ప్రారంభమైంది.