బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 10:36 AM
అనాథ పిల్లలకు ఆశ్రయంతో పాటు భవిష్యత్తును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ, జీఎంఆర్ ఏరో అకాడమీ, ఫిక్కీ, అజీమ్ ప్రేమ్ జీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వచ్చే నెల మార్చి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అనాథ యువతీ యువకులకు ఏవియేషన్ రంగంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్, కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించనున్నారు. అలాగే, పాలిటెక్నిక్ చదువుతున్న అనాథ ఆడబిడ్డలకు సాఫ్ట్వేర్, డిజిటల్ స్కిల్స్లో ఫిక్కీ శిక్షణ ఇవ్వనుంది.