|
|
by Suryaa Desk | Sat, Nov 18, 2023, 02:45 PM
లేడీ సూపర్ స్టార్ నయనతార నేడు తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా భర్త విఘ్నేష్ శివన్ కూడా నయన్‌కి స్పెషల్‌గా విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే నయనతార. లవ్ యూ మై ఉయిర్, ఉలగం. నా జీవితం యొక్క అందం, అర్థం మీరు.. మీ సంతోషమే’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న అందాల నటి నయనతార శనివారం తన 39వ పుట్టినరోజును జరుపుకుంటోంది. మలయాళీ చిత్రం 'మనస్సినక్కరే'తో వెండితెరకు పరిచయం కాగా, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. 40 ఏళ్లు వస్తున్నా.. రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. శ్రీరామరాజ్యం మూవీలో నటనకు గానూ ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులను దక్కించుకుంది.
Latest News