![]() |
![]() |
by Suryaa Desk | Wed, Feb 12, 2025, 12:23 PM
బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత– మనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’ . ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న బాక్సాఫీసు ముందుకు రానుంది. ‘‘ఇటీవల జరిగిన ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కూ ముఖ్య అతిథిగా వెళ్లా. దాంతో, నేను తప్ప ఎవరూ లేరా? అని మీకూ అనిపించొచ్చు. ఎక్కువ చిత్రాలు వస్తున్న కారణంగా దానికి తగ్గట్టే వేడుకలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. సినిమాకి కథ ఎంత ముఖ్యమో.. దాని విడుదల తేదీ కూడా అంతే ముఖ్యం. ప్రేక్షకులకు చేరువ చేయడం అత్యంత ప్రాధాన్యం. దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అద్భుతంగా ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా ఈ మూవీ టీమ్ కనిపించేది’’ అని అన్నారు.
Latest News