|
|
by Suryaa Desk | Sat, Dec 09, 2023, 09:03 PM
కేసీఆర్ ఆరోగ్యంపై ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రామోజీరావు ఆకాంక్షించారు. ఈ మేరకు కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆయన లేఖ రాశారు. కేసీఆర్ త్వరగా కోలుకొని రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలన్నారు. మరోవైపు కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ విజయవంతమైందని, ఆయన కోలుకుంటున్నారని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్నట్లు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశముందన్నారు. కేసీఆర్ కు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని, త్వరితగతిన కోలుకోవడానికి అనుకూలంగా కేసీఆర్ శరీరం సహకరిస్తున్నట్లు తెలిపారు. మానసికంగానూ కేసీఆర్ దృఢంగా ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు.