|
|
by Suryaa Desk | Sat, Dec 09, 2023, 09:04 PM
నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు (ఆదివారం) రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రేపు ఉదయం సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు ఉదయం ప్రత్యేక పూజల అనంతరం ఆయన రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు బాధ్యతలు అందుకోనున్నారు.రెండు రోజుల క్రితం సీఎంగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా మరో 11 మంది ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అదే రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలో ముఖ్యమంత్రి సహా కేబినెట్లో 18 మందికి చోటు దక్కనుంది. సీఎం సహా డిసెంబర్ 7న పన్నెండు మంది ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరుగురికి కేబినెట్లో చోటు దక్కనుంది. ఆ ఆరుగురు ఎవరన్నది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.