|
|
by Suryaa Desk | Mon, Dec 11, 2023, 11:28 AM
డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు 11 మంది మంత్రులకు సచివాలయంలో ఛాంబర్లు కేటాయిస్తూ సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. పొంగులేటి శ్రీనివాస్లెడ్డికి గ్రౌండ్ ఫ్లోర్లో, సీతక్కకు ఫస్ట్ ఫ్లోర్లో, భట్టి, దామోదరకు 2వ ఫ్లోర్లో, తుమ్మల, శ్రీధర్ బాబుకు 3వ ఫ్లోర్లో, ఉత్తమ్, కొండా సురేఖ, జూపల్లికి 4వ ఫ్లోర్లో, పొన్నం, కోమటిరెడ్డికి 5వ ఫ్లోర్లో ఛాంబర్లు కేటాయించారు.
కాగా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, 11 మంది మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కింది అంతస్తులో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మొదటి అంతస్తులో సీతక్క, రెండో అంతస్తులో భట్టి, మూడో అంతస్తులో దామోదర, నాలుగో అంతస్తులో ఉత్తమ్ శ్రీధర్‌బాబు, ఐదో అంతస్తులో పొన్నం జూపల్లి, కొండాకు ఛాంబర్లు కేటాయించారు. ఐదో అంతస్తులో సురేఖ, కోమటిరెడ్డి.