|
|
by Suryaa Desk | Mon, Dec 11, 2023, 11:30 AM
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ ప్రజాభవన్‌లో సీఎం ఆధ్వర్యంలో, జిల్లాల్లో మంత్రుల సమక్షంలో నిర్వహించాలని సిద్ధమవుతున్నారు. ప్రతి రోజూ కనీసం గంట సేపు దర్బార్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్గదర్శకాలు రెడీ చేయాలని సీఎం సైతం ఆదేశించినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎమ్మెల్యేల స్థూల నెలసరి జీతం ఏకంగా 163 శాతం పెరిగింది. వివరాలు ఇలా..
* ఒక ఎమ్మెల్యే నెల జీతం రూ.2.50 లక్షలు. ఇందులో అసలు వేతనం రూ.20 వేలు కాగా.. నియోజకవర్గ అలవెన్స్‌లు రూ.2.30 లక్షలు ఉంటుంది.
* అసెంబ్లీ సమావేశాలకు వెళ్లినప్పుడు రోజుకు రూ.1000 చెల్లిస్తారు.
* ముఖ్యమంత్రి వేతనం రూ.4.21 లక్షలు(ప్రస్తుతం సీఎంగా రేవంత్ ఉన్నారు)
* శాసన సభాపతి వేతనం రూ.4.11 లక్షలు
* మంత్రులు, చీఫ్ విప్, విప్‌ల వేతనం రూ.4 లక్షలు