|
|
by Suryaa Desk | Mon, Dec 11, 2023, 11:37 AM
భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం కానున్నారు. నిన్న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మెరికా ఈజ్ గ్రేట్… అమెరికన్ రోడ్స్ ఈజ్ గ్రేట్ అని పొగడ్తలతో ముంచేశారు. నాకు రోడ్లు భవనాలు శాఖ ఇచ్చినందుకు థాంక్స్ అన్నారు. కౌన్సిల్ హాల్ ను షిఫ్ట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇలా చేసే భాద్యత నాకు అప్పగించారని తెలిపారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద బ్యూటిఫికేషన్ పనులు చేపడతామన్నారు.