సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్
Wed, Dec 25, 2024, 06:31 PM
by Suryaa Desk | Fri, Dec 27, 2024, 02:57 PM
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశం మేరకు ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ కోరింది. కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దన్న ఉత్తర్వులను ఈ నెల 31వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని వారం రోజుల క్రితం హైకోర్టు ఏసీబీని ఆదేశించిన సంగతి తెలిసిందే.