![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 03:39 PM
దామరగిద్ద మండలం మొగులమడ్క గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విధానాలు, కేసీఆర్ చేసిన అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.