![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 01:59 PM
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరమోధుడిగా, ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమ సమాజ దార్శనికుడిగా జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు మహోన్నతమైనవని కొనియాడారు. చిన్ననాటి నుంచే వివక్షను ఎదుర్కొన్న ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని కేసీఆర్ చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలంగా పాల్గొన్నారని అనంతరం దేశ స్వయంపాలనలో కేబినెట్ మంత్రిగా కార్మిక శాఖలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారని కితాబునిచ్చారు. దేశ రక్షణ, వ్యవసాయం, టెలి కమ్యూనికేషన్స్ శాఖలకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని చెప్పారు. ఉప ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారని అన్నారు. ఆయన జయంతిని సమతా దివస్ గా జరుపుకోవడం జాతి కోసం వారు చేసిన సేవలకు దర్పణంగా నిలుస్తుందని అన్నారు. అంటరానితనం, కులం పేరుతో కొనసాగుతున్న సామాజిక వివక్ష సంపూర్ణంగా సమసిపోయే దిశగా మనందరం పని చేసినప్పుడే బాబు జగ్జీవన్ రామ్ కు ఘనమైన నివాళి అర్పించిన వారమవుతామని చెప్పారు.