![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 12:57 PM
దేశంలో 30 ఏళ్లు దాటినా వివాహం కాని యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని సర్వేలు చెపుతున్నాయి. అన్ని సామాజిక వర్గాల్లోనూ ఇదే సమస్య నెలకొంది. ఇందుకు యువకుడు, యువతి కుటుంబ సభ్యులు కూడా కారణం అవుతున్నారు. ఉద్యోగం, సంపాదన ఉన్నా అమ్మాయి దొరకక పోవడంతో యువకులు, వారి తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారు. చాలామంది ఫంక్షన్లకు కూడా దూరంగా ఉంటున్నారు. దీంతో, పెళ్లి పట్ల విరక్తి భావం పెరుగుతోందని ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతున్నట్లు సమాచారం.