![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 03:03 PM
వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. చంద్రఘడ్ గ్రామానికి చెందిన అనిత అనే గర్భిణీ రాత్రి పురిటీ నొప్పులతో అమరచింత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో, సిబ్బంది సాధారణ డెలివరీకి ప్రయత్నించారు. బిడ్డ తల బయటకు రాకపోవడంతో, కాన్పు మధ్యలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పసికందు తల మొండెం రెండు భాగాలుగా కోసి బయటకు తీశారు. కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన పసికందును చూసి కన్నీరుమున్నీరయ్యారు