![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 04:26 PM
దేశీయ వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ చాలా వెనకబడి ఉందని BRS నేత హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సగటు జీఎస్టీ వృద్ధిరేటు 10% ఉందని తెలిపారు. రాష్ట్రం కేవలం 5.1% వృద్ధి సాధించినట్లు గణాంకాలు చెప్తున్నాయన్నారు. GST 12.3 శాతమన్న భట్టి వ్యాఖ్యలు అవాస్తవమని తేలాయని చెప్పారు. ఆర్థిక మంత్రి సభను మాత్రమే కాదు.. రాష్ట్ర పౌరులను మోసం చేశారని అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమని, నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.