![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 03:27 PM
ఖమ్మం నగరంలో ఉన్న బంజారా భవన్లో హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ధరావత్ రామ్మూర్తి నాయక్ ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. బుధవారం బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీ నిధులు మంజూరుకు కృషి చేస్తానని సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు. జర్పుల భీముడు నాయక్, బానోత్ చంద్రం, బానోత్ తారబాయ్ ఉన్నారు.