![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 02:42 PM
హైదరాబాద్‌లోని ఓల్డ్ మలక్‌పేటలో కుటుంబ తగవులతో సొంత అక్కను ఓ తమ్ముడు హతమార్చాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పాత మలక్‌పేటలో ఉంటున్న లక్ష్మికి ఆమె తమ్ముడు మదన్ బాబుకు ఆస్తి తగవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మదన్ బాబు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై స్థానికులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే లక్షిని చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.