![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 01:00 PM
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన దివిస్ కంపెనీ ఎదురుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చౌటుప్పల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏటీఎం లోనికి బుధవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి సీసీ కెమెరాలకు నల్లటి పెయింట్ స్ప్రే చేసి ఏటీఎం నుండి నగదు దొంగతనం చేసినట్లుగా చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు, ఏటీఎంలో దొంగతనం జరిగిన విషయాన్ని ఎస్బిఐ బ్రాంచ్ అధికారులు ముందుగా గుర్తించి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏటీఎం లో దొంగతనం జరిగిన సమయంలో సుమారు 12 లక్షల వరకు నగదు ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దొంగతనం జరిగిన ఏటీఎం ను పోలీసు ఉన్నతాధికారులు సందర్శించి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. దీనిపై ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.