|
|
by Suryaa Desk | Sun, Apr 13, 2025, 07:17 PM
కొండమల్లేపల్లి మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చి సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు ఆదివారం పోలీస్ స్టేషన్లో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను అప్పగించారు పోలీసులు.
ఎస్సై రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం సెల్ ఫోన్లు పోగొట్టుకున్న పలువురు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిబిసిఐడి పోర్టల్ ద్వారా కనుగొని దొరికిన వారి నుండి రికవరీ చేసి పది మంది బాధితులకు అప్పగించామని తెలిపారు.