|
|
by Suryaa Desk | Sun, Apr 13, 2025, 08:19 PM
ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు, అబద్ధాలు చెప్పుడు, చెట్లు నరకుడు ఇవి రేవంత్ రెడ్డి బ్రాండ్లు అని BRS మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు విమర్శలు చేశారు. దేవుడిపై ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన వ్యక్తి రేవంత్ అని మండిపడ్డారు. 'అటు అసెంబ్లీలో ఇటు బయట ఎక్కడైనా రేవంత్ అబద్ధాలు చెప్తాడు. ఎకరాలకు ఎకరాలు చెట్లు నరికిస్తున్నాడు. రైతులు చెట్లు నరికితే కేసులు పెడతారు.. మరి 400 ఎకరాలలో చెట్లు నరికితే రేవంత్‌పై కేసు పెట్టరా?' అని ప్రశ్నించారు.