|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 02:55 PM
దోమలపెంట దగ్గర ఎస్ఎల్‌బీసీ సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి మంగళవారం నాటికి 53 రోజులు గడుస్తోంది. నిపుణుల సూచనలు, సలహాల మేరకు అత్యాధునిక సాంకేతిక పరికరాలు వినియోగించి మట్టి తవ్వకాలు, టీబీఎం శకలాల తొలగింపు చేపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 సంస్థల 560 మంది సిబ్బంది రాత్రింబవళ్లు గల్లంతైన ఆరుగురి ఆచూకీ గుర్తించేందుకు శ్రమిస్తున్నా ఇంతవరకు దొరకలేదు.