|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 08:24 AM
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు తమను కోరుతున్నారన్న దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల వెనక కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రగా భావిస్తున్నామని కాంగ్రెస్ నేతలు, మంత్రులు మండిపడ్డారు. విచారణ జరిపి చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తామని పేర్కొన్నారుకొనుగోలు చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమైనా సంతలో వస్తువులా అని మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చోటా, మోటా కాంట్రాక్టర్లు కూల్చితే కూలే ప్రభుత్వం కాదని, ఇలాంటి వాటికి భయపడబోమని తేల్చి చెప్పారు. ప్రజల నుంచి తమకు సంపూర్ణ మద్దతు ఉందన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్ ఆత్మ అని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ సూచనలతోనే ప్రభాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై తొలి నుంచీ కుట్రలు జరుగుతూనే ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య జ్యోతిష్యం కూడా చెబుతున్నారని ఎద్దేవా చేశారు.