|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 06:19 PM
రేవంత్ పాలనలో తెలంగాణ రైసింగ్ కాదు.. ఫాలింగ్ అని BRS నేత హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి గణనీయంగా పడిపోతుండటం ఆందోళనకరమని చెప్పారు. ఇటీవల విడుదలైన CAG రిపోర్ట్ ప్రకారం.. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం (SOTR) 2023-24లో ₹1,24,146.19 కోట్లు కాగా, 2024-25 నాటికి ₹1,24,054.38 కోట్లకు తగ్గి, ₹91.81 కోట్ల తగ్గుదల నమోదైందని వివరించారు. 2014-15 నుండి 2022-23 వరకు BRS పాలనలో12% CAGRతో SOTR వృద్ధిని సాధించిందని చెప్పారు.