|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 09:38 PM
కోటగిరి మండల కేంద్రంలోని యశశ్రీ హైస్కూల్ లో ఐదవ తరగతి చదివి జవహార్ నవోదయలో 6వ తరగతికి సీటు సాధించిన గజావధన్ అనే విద్యార్థికి గురువారం అభయాసం ఫౌండేషన్ నిర్వాహకులు బర్ల మధు ఘనంగా సన్మానించారు.
చదువు ఉంటే పేదరికాన్ని జయించవచ్చని, చదువుతోపాటు మంచి క్రమశిక్షణ అవలంబించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వరూప, శంకర్, చిత్తారి నరేందర్, హస్గుల విజయ్, ఇందురి సాయి, తదితరులున్నారు.