|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 02:44 PM
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఎకరాలకు ఎకరాలు పొగాకు సాగు చేసిన వ్యవసాయ రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. గిట్టుబాటు ధర లేక పొగాకును పంట పొలాల్లోనే రైతులు వదిలేస్తున్నారు.
వీఎస్టీ లాంటి కంపెనీలు కూడా రైతులను ముప్పతిప్పలు పెడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటిక్యాల, ఉదండాపురం, చాగాపురం, శనగపల్లి గ్రామాలలో పొగాకును రైతులు పొలాల్లోనే ఉంచారు. రూ. 12 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని వారు కోరుతున్నారు.