|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 07:11 PM
తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్‌పోలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పాల్గొంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. "ఈ ఎక్స్‌పో పాలుపంచుకోవటం గర్వంగా ఉంది. ప్రభుత్వం అనుసరిస్తున్న స్థిరమైన విధానాలు, సులభతర పారిశ్రామిక విధానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. ‘హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారు చేయండి.. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకొండి..’ అని జపాన్ కంపెనీలను సీఎం తెలంగాణకు ఆహ్వానించారు.