|
|
by Suryaa Desk | Tue, Apr 22, 2025, 08:24 AM
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆకుల దీపిక (38) హస్తినాపురం టీచర్స్ కాలనీలో భర్త, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. భర్త రవికుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో దీపిక కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.