|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 02:54 PM
భానుడు భగ్గుమంటున్నాడు. కామారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా జుక్కల్ నియోజకవర్గంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. నిన్న జుక్కల్‌లో 43.8, మద్నూర్ 43.8, బిచ్కుందలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఒక్క నస్రుల్లాబాద్ మండలంలోనే 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉండగా 43.8 ఉష్ణోగ్రత నమోదుకావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. అత్యవసరం అయితే తప్ప జనాలు బయటికి రావద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు.