|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 03:31 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల 30 ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించారు. ఈ పథకాన్ని ఏప్రిల్ 1 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారితో కలిసి నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం కేంద్రంలో సన్న బియ్యం పథకం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి ఇంట్లో సహపంక్తి భోజనం చేయడం జరిగింది. ఎంపీ చామల మాట్లాతూ .... ఆ పేదవారి ముఖంలో చాలా సంతోషం కనబడింది. గతంలో వాళ్లు ఏదైనా పండగ వస్తే రెండు మూడు కిలోల సన్న బియ్యం కొనుక్కొచ్చి తినేవారు. అలాంటిది మన ప్రజా ప్రభుత్వంలో సన్నబియ్యం ప్రతిరోజు తింటున్నారు. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఆ అమ్మ ఉంటున్న గుడిసెను చూస్తూనే అర్థమవుతుంది.. బంగారు తెలంగాణ ఎలా ఉందో అని.. గుడిసెలో ఉంటున్న ఆ నిరుపేదలను చూసి వెంటనే ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయాలని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఆమె ఇద్దరు కొడుకులకు రాజీవ్ వికాస్ పథకాన్ని కూడా వర్తింప చేయాలని కోరాం.
బుచ్చమ్మ తో కలిసి సన్నబియ్యంతో వండిన అన్నం తిన్నారు. అనంతరం బుచ్చమ్మ కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె నిరుపేద మహిళ కావడంతో అప్పటికప్పుడే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే కాక నిర్మాణానికి అయ్యే ఖర్చులకు రూ.50 వేలు అందజేశారు. ఎంపీ రూ.20 వేలు, ఎమ్మెల్యే రూ.20 వేలు, కలెక్టర్ రూ.10 వేలు ఆర్థికంగా సాయం అందించారు. అనంతరం ఆర్థిక సాయం అందజేసిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.