|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 06:07 PM
ఏళ్లనాటి సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం పరిష్కారం చూపుతున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అమరేందర్ బుధవారం అన్నారు. ఉప్పునుంతల మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు.
భూ భారతి చట్టంభూవి వాదాల పరిష్కారానికి దోహదం చేస్తుందని ఏళ్ల నాటి సమస్యలకు ఇక చెక్ పెట్టొచ్చని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సమస్యలు ఉన్న ప్రతి రైతు వినియోగించుకోవాలని కోరారు.