|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 07:38 PM
కేంద్రం కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం పేర్కొన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ మినహా ఇతర కులాలను.. పరిగణనలోకి తీసుకునేవారు కాదని ఉత్తమ్ వెల్లడించారు. దీనిపై రాహుల్‌గాంధీ ఎన్నోసార్లు డిమాండ్ చేశారని ఉత్తమ్ అన్నారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన చేశామని.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేశామని ఉత్తమ్ వెల్లడించారు. తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని ఉత్తమ్ అన్నారు.అయితే, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతానికి చర్యలు చేపట్టి 2027 మార్చి నాటికి ఉదండాపూర్ వరకు నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు సత్వర చర్యలకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం.. పాలమూరు జిల్లా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది అని ఆరోపించారు. టీఆర్ఎస్ హయాంలో కృష్ణా నది జలాల కేటాయింపులో పాలమూరు, నల్లగొండకు తీరని అన్యాయం జరిగింది అన్నారు