|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 01:48 PM
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ జడ్పీ పాఠశాలలో చదివిన రాథోడ్ యోగేశ్వర్, వేల్పుల నరేందర్ టెన్త్ క్లాస్‌లో మండల టాపర్లుగా నిలిచారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. యోగేశ్వర్ 582 మార్కులతో మండల టాపర్‌గా, నరేందర్ 570 మార్కులతో రెండో టాపర్‌గా నిలిచారు.
ఉపాధ్యాయుల పర్యవేక్షణలో కలిసి చదుకున్న ఈ ఇద్దరు విద్యార్థులు, గ్రూప్ డిస్కషన్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకునేవారని శుక్రవారం తెలిపారు. వీరి స్నేహం, కఠోర శ్రమ, సమిష్టి వారి విజయానికి కీలకమని ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ ఇద్దరు విద్యార్థుల సాధన మండలంలోని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పాఠశాల సిబ్బంది అభిప్రాయపడ్డారు.