|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 03:59 PM
జమ్మూకాశ్మిర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ నుంచి అందుతున్న ఆర్థిక సహకారాన్ని నిరోధించే దిశగా భారత్ కీలక చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. పాకిస్థాన్‌పై రెండు విధాలుగా ఆర్థికపరమైన ఒత్తిడి తీసుకురావాలని భారత్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మొదటి చర్యగా పాకిస్థాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ‘గ్రే లిస్ట్’లోకి తిరిగి చేర్చేందుకు భారత్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అరికట్టడంలో విఫలమయ్యే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో చేరుస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న పాకిస్థాన్‌ను తిరిగి అందులోకి చేర్చడం ద్వారా ఉగ్రవాదానికి నిధులు అందకుండా అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని భారత్ భావిస్తోంది.