|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 10:38 AM
గత నెల 30న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో చోటు చేసుకుంది. సంజనా సర్కార్(16)కి హిందీలో రెండు మార్కులు తక్కువ రావడంతో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్థాపం చెందిన ఆమె ఇంట్లోని గడ్డిమందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించి విద్యార్థిని మరణించింది.