|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 11:56 AM
సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం చివరికి మోసం, దుర్వినియోగానికి దారి తీసింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక భారత యువకుడితో ప్రేమలో పడిన థాయ్‌లాండ్‌కు చెందిన యువతి, అతని పిలుపుతో భారత్‌కు వచ్చింది. కానీ ఆమె ఆశలు గగనమెక్కగా, వాస్తవాలు కింద పడేశాయి.
చెన్నైకి చెందిన యువకుడితో 30 ఏళ్ల థాయ్ యువతికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో, అతడు రమ్మన్నాడని నమ్మి ఇండియాకు వచ్చి చెన్నై చేరింది. అక్కడ ఓ హోటల్‌లో ఆమెపై యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటన తర్వాత యువతి పూర్తిగా ఒక్కటైపోయింది.
తన స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు అవసరమైన డబ్బుల్లేక, అమ్మాయిని వ్యభిచారంలోకి దిగేందుకు బలవతం చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వ్యభిచార నిర్వహణపై పోలీసులకు వచ్చిన సమాచారంతో, యువతిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మహిళల భద్రత, సోషల్ మీడియా పరిచయాల్లో జాగ్రత్తలు అవసరమనే విషయం మరోసారి ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతోంది.