|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 02:27 PM
పద్మశ్రీ పురస్కార గ్రహీత, MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మందకృష్ణను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సామాజిక న్యాయంతో పాటు ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ కృషిని సీఎం కొనియాడారు.