|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 01:15 PM
నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో నేటితో రాష్ట్రం ఏర్పడి 11 యేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం విషెస్ తెలియజేస్తూ పోస్టులు పెట్టారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ కూడా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.