|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 12:11 PM
మున్సిపల్ కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలని మంగళవారం మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టియుసిఐ నాయకులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి వినతి పత్రాన్ని అందించారు. రెండు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, మున్సిపల్ సాధారణ బడ్జెట్ నుంచి వేతనాలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సాధారణ బడ్జెట్ నుంచి ఉద్యోగులు, కార్మికుల వేతనాలు చెల్లించి తరువాత అభివృద్ధి పనులకు నిధులు వాడాలని చెప్పారు.