|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 03:27 PM
రైతుల స్వయం సమృద్ధిని లక్ష్యంగా చేసుకొని నాణ్యమైన విత్తనాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఏవో వీరన్న పేర్కొన్నారు. మంగళవారం వేమనపల్లి రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ సభ్యుడు సంతోష్ కుమార్, వ్యవసాయ శాస్త్రవేత్త నాగరాజు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సయ్యద్ సాబీర్ అలీతో కలిసి రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రోక్సర్ సుల్తానా, హెప్సభ తదితరులు పాల్గొన్నారు.
రైతుల అభివృద్ధి, వ్యవసాయ ఉత్పాదకత పెంపు కోసం ఈ విధంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ ముఖ్యమైనదని అధికారులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు.