|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 11:43 AM
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నవంబర్ 6 నుంచి రెండు రోజుల పాటు 2వ విడత విచారణ జరగనుంది. BRS నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ, డాక్టర్ సంజయ్‌లను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. పిటిషన్లు వేసిన BRS MLAలను కూడా విచారణకు హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం కోరింది. ఈ విచారణ నవంబర్ 6, 7 తేదీల్లో జరగనుంది, ఆ తర్వాత 12, 13 తేదీల్లో క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది.