|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 01:34 PM
దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్-2047 విజన్‌ను యూఏఈ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలోనే తొలి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా 30,000 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి అవకాశాలపై చర్చించారు.విద్య, ఆరోగ్యం, ఏఐ, పరిశ్రమలు, నివాసాలు, వినోద రంగాలకు ప్రత్యేక జోన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మారుబేని, సెమ్‌కార్ప్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం చేతులు కలిపాయని అన్నారు. ఫ్యూచర్ సిటీలో జూను స్థాపించడం కోసం రిలయన్స్ గ్రూప్ వంతారాతో అవగాహన ఒప్పందం కుదిరిందని ముఖ్యమంత్రి వివరించారు.