బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 03:37 PM
సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ పోలింగ్ కేంద్రాలు, గీతా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఇప్పలపల్లి ప్రాథమిక పాఠశాలలను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ బుధవారం పరిశీలించారు. హెల్ప్ డెస్క్, మెడికల్ క్యాంప్, ఓటింగ్ సరళిని సందర్శించి అధికారులతో మాట్లాడారు. అనంతరం వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సినారె కళామందిరం, గాంధీ నగర్ గ్రీన్ పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, టీపీఓ తదితరులు పాల్గొన్నారు.