|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 03:29 PM
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో జరిగినవి చిన్న గొడవలేనని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌లలో ప్రచారం చేస్తే పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. అధికార పార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ భద్రత కల్పించామని తెలిపారు. ఇందులో 1,302 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 1,926 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఈ కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించామని డీజీపీ తెలిపారు. పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ 100 శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రం వెలుపల కూడా నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశామన్నారు.